ప్రపంచ కప్‌పై నజర్‌

ABN , First Publish Date - 2022-11-25T03:29:59+05:30 IST

మొన్నటిదాకా పొట్టి ప్రపంచ కప్‌, అనంతరం మూడు టీ20ల సిరీస్‌. ఈనేపథ్యంలో టీ20 ఫార్మాట్‌ను పక్కనబెట్టి భారత్‌-న్యూజిలాండ్‌ వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పపై దృష్టి ..

ప్రపంచ కప్‌పై నజర్‌

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డే నేడు

ఉదయం 7 నుంచి

అమెజాన్‌ ప్రైమ్‌, డీడీ స్పోర్ట్స్‌లో..

ఆక్లాండ్‌: మొన్నటిదాకా పొట్టి ప్రపంచ కప్‌, అనంతరం మూడు టీ20ల సిరీస్‌. ఈనేపథ్యంలో టీ20 ఫార్మాట్‌ను పక్కనబెట్టి భారత్‌-న్యూజిలాండ్‌ వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పపై దృష్టి సారించనున్నాయి. 2023 అక్టోబరు-నవంబరులో భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహాలను టీమిండియా ఈ సిరీ్‌సనుంచే మొదలవనున్నాయి. భారత్‌-కివీ్‌స జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో తొలి వన్డే శుక్రవారం ఇక్కడి ఈడెన్‌ పార్క్‌లో జరగనుంది.

స్టార్లు లేకున్నా బలంగానే భారత్‌..: సీనియర్లు రోహిత్‌, విరాట్‌, రాహుల్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌, బుమ్రా, జడేజా లేకున్నా టీమిండియా నాణ్యమైన ఆటగాళ్లతో నిండి ఉంది. అంతేకాదు..టీ20 సిరీస్‌ గెలవడంతో టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌... శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. ఎనిమిది వన్డేల్లో వీరిద్దరూ మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాలని సూర్యకుమార్‌ పట్టుదలగా ఉన్నాడు. వైస్‌కెప్టెన్‌ పంత్‌ మిడిలార్దర్‌లో రానున్నాడు. ఆల్‌రౌండర్‌గా దీపక్‌ హుడా ఒక్కడే జట్టులో ఉన్నా..సుందర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ బౌలర్లగానేకాదు అవసరమైతే బ్యాట్‌ ఝళిపించగల సమర్థులు. దాంతో బ్యాటింగ్‌ విభాగం బలీయంగానే ఉంది.

విలియమ్సన్‌ రాక..: ఆఖరి టీ20కి దూరమైన విలియమ్సన్‌ పునరాగమనం కివీ్‌సలో ఉత్సాహం నింపింది. కేన్‌, టామ్‌ లాథమ్‌తో జట్టు మిడిలార్దర్‌ బలంగా కనిపిస్తోంది. భారత్‌పై అద్భుత రికార్డు కలిగిన మ్యాట్‌ హెన్రీ చేరికతో పేస్‌ విభాగం పటిష్టంగా మారింది. ఇటీవలి కాలంలో కేవలం ఐదుగురు పూర్తిస్థాయి బౌలర్లతోనే బరిలో దిగుతున్న కివీస్‌ ఈ సిరీ్‌సలోనూ అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశముంది.

రికార్డు...ఇలా: ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ పిచ్‌పై ఇప్పటివరకూ 77 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 30, రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు 42 మ్యాచ్‌లో నెగ్గాయి. 2020లో భారత్‌-కివీ్‌స చివరిసారి ఇక్కడ ఆడినప్పుడు ఆతిథ్య జట్టు 273/8 చేయగా, భారత్‌ 48.3 ఓవర్లలో 251 రన్స్‌ చేసి ఓటమిపాలైంది. పతనమైన 18 వికెట్లలో 14 పేసర్లకే దక్కాయి.

జట్లు (అంచనా)

భారత్‌: శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), గిల్‌, శ్రేయాస్‌, సూర్యకుమార్‌, పంత్‌ (కీపర్‌), హుడా, సుందర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌/కుల్దీప్‌

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), అలెన్‌, కాన్వే, లాథమ్‌ (కీపర్‌), మిచెల్‌, ఫిలిప్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్‌

పిచ్‌/వాతావరణం

పిచ్‌ బ్యాటర్లతోపాటు పేసర్లకు కూడా అనుకూలిస్తుంది. చిన్న బౌండరీతో బ్యాటర్లకు పం డగే. మబ్బులు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నందున టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపవచ్చు.

Updated Date - 2022-11-25T03:30:16+05:30 IST