మహిళల వన్డే వరల్డ్‌కప్‌ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

ABN , First Publish Date - 2022-02-16T08:42:24+05:30 IST

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో విజేత జట్టుకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి రెట్టింపయ్యింది.

మహిళల వన్డే వరల్డ్‌కప్‌   విజేతకు భారీ ప్రైజ్‌మనీ

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో విజేత జట్టుకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి రెట్టింపయ్యింది. మార్చి 4నుంచి ఏప్రిల్‌ 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జట్టు సుమారు రూ.9 కోట్ల 94 లక్షలు దక్కించుకుంటుంది. 2017లో జరిగిన టోర్నీలో విజేత ఇంగ్లండ్‌కు రూ.5 కోట్ల ప్రైజ్‌మనీ మాత్రమే లభించింది. ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.4 కోట్ల 51 లక్షలు, మూడో స్థానం జట్టుకు రూ. 2.3 కోట్లు దక్కుతాయి. 

Read more