15 ఏళ్ల IPL చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేటు ఏ ఆటగాడిదో తెలుసా..

ABN , First Publish Date - 2022-05-22T22:04:38+05:30 IST

ముంబై: ఐపీఎల్2022 (IPL2022) లీగ్ దశ నేటితో(ఆదివారం) ముగిసిపోనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌లు తేలిపోవడంతో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్నది మొ

15 ఏళ్ల IPL చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేటు ఏ ఆటగాడిదో తెలుసా..

ముంబై: ఐపీఎల్2022 (IPL2022) లీగ్ దశ నేటితో(ఆదివారం) ముగిసిపోనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌లు తేలిపోవడంతో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్నది మొక్కుబడి మ్యాచ్ మాత్రమే. ప్లే ఆఫ్‌లో 4 మ్యాచ్‌లతో ఐపీఎల్ -15 విజేత ఎవరో తెలిపోనుంది. కాగా 2008లో మొదలైన ఐపీఎల్‌కు ప్రస్తుత సీజన్‌తో కలిపి 15 వసంతాలు పూర్తవుతాయి. ఈ  ధీర్ఘకాల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక  స్ట్రైయిక్ రేటుతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించిన స్టార్ బ్యాట్స్‌మెన్లు ఎవరు, ఎన్ని పరుగులు కొట్టారో  ఓ లుక్కేద్దాం..


కనీసం 1000 పరుగుల చేసిన ఆటగాళ్లను పరిశీలనలోకి తీసుకుంటే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఐపీఎల్‌లో అత్యధికంగా 177.88 స్ట్రైక్ రేటును కలిగివున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆటగాడు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2035 పరుగులు పూర్తి చేశాడు. రెండవ స్థానంలో ఇండియన్ క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 155.44 స్ట్రైయిక్ రేటుతో మొత్తం 2728 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాక్స్‌వెల్ 154.05 స్ట్రైక్ రేటుతో ఐపీఎల్ మొత్తం 2286 పరుగులు కొట్టాడు. ఇక నాలుగవ స్థానంలో మాజీ ఆర్సీబీ ఆటగాడు, మిస్టర్ 360గా పేర్కొనే ఏబీ డివీలియర్స్ ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ క్రికెట్ దిగ్గజం 151.68 స్ట్రైయిక్ రేటుతో ఏకంగా 5162 పరుగులు కొట్టాడు. 150కిపైగా స్ట్రైయిక్ రేటుతో ఈ స్థాయిలో పరుగులు సాధించిన మరో ఆటగాడెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కాగా కొత్తగా కొంతమంది ఆటగాళ్ల చక్కటి స్ట్రైయిక్ రేటును కలిగివుంటున్నారు. అయితే దీర్ఘకాలంలో ఇదే విధంగా కొనసాగగలరా లేదా అనేది వేచిచూడాలి...

Updated Date - 2022-05-22T22:04:38+05:30 IST