Ind vs Zim : జాతీయ గీతాలాపన ముందు కేఎల్ రాహుల్ ఏం చేశాడో చూడండి.. సోషల్ మీడియాలో..

ABN , First Publish Date - 2022-08-19T23:05:29+05:30 IST

టీమిండియా(Team India) కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేశాడు.

Ind vs Zim : జాతీయ గీతాలాపన ముందు కేఎల్ రాహుల్ ఏం చేశాడో చూడండి.. సోషల్ మీడియాలో..

హరారే : టీమిండియా(Team India) కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేశాడు. గురువారం(నిన్న) ఇండియా వర్సెస్ జింబాబ్వే (India vs Zimbabwe) తొలి వన్డేలో జట్టు సారధిగా వ్యవహరించాడు. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే చేధించడంతో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. అయినప్పటికీ అతడిపై సోషల్ మీడియా (Social media) వేదికగా పొగడ్తల వర్షం కురుస్తోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన(National Anthem) సమయంలో హూందాగా నడుచుకోవడమే ఇందుకు కారణంగా ఉంది. భారత జాతీయ గీతం ‘జనగణమన..’ ఆలపించడానికి ముందు తన నోట్లో ఉన్న చూయింగ్ గమ్(chewing gum)ని  రాహుల్ చేతితో బయటకు తీసేశాడు. ఆ తర్వాత శ్రద్ధగా జనగణమన ఆలపించాడు. తద్వారా జాతీయగీతం పట్ల తన గౌరవం, క్రమశిక్షణను చాటుకున్నాడు. ఈ దృశ్యం కెమెరా కళ్లకు చిక్కడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ పట్ల గర్వంగా భావిస్తున్నట్టు నెటిజన్లు స్పందిస్తున్నారు. 


జాతీయ గీతాలాపనకు ముందు రాహుల్ తన నోటిలోని చూయింగ్ గమ్‌ని బయటకు తీసేశాడంటూ ప్రశంసిస్తున్నారు. గర్వంగా భావిస్తున్నట్టు ట్విటర్‌లో పలువురు పోస్టులు పెట్టారు. జాతీయ గీతానికి గౌరవం ఇచ్చాడని కొనియాడుతున్నారు. కాగా జింబాబ్వే వర్సెస్ ఇండియా తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  190 పరుగుల ఛేదనలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (72 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 82 నాటౌట్‌), శిఖర్‌ ధవన్‌ (113 బంతుల్లో 9 ఫోర్లతో 81 నాటౌట్‌) నిలకడైన బ్యాటింగ్‌తో ఆతిథ్య బౌలర్లను ఆడేసుకున్నారు.  దీంతో సిరీస్‌లో 0-1 ఆధిక్యం సాధించింది. ఇక రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది.





Updated Date - 2022-08-19T23:05:29+05:30 IST