IRL : ద్వితీయ స్థానంతో సరి

ABN , First Publish Date - 2022-12-12T05:00:28+05:30 IST

వరుణుడు పలకరింపులు, అంతంత మాత్రంగా ఉన్న రేసింగ్‌ సర్క్యూట్‌ ప్రమాణాలు, వెలుతురులేమి రూపం లో పలు అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా

IRL : ద్వితీయ స్థానంతో సరి

ఆఖరి రౌండ్‌లో హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన

ఓవరాల్‌ చాంపియన్‌ కొచ్చి

ముగిసిన ఐఆర్‌ఎల్‌ తొలి సీజన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరుణుడు పలకరింపులు, అంతంత మాత్రంగా ఉన్న రేసింగ్‌ సర్క్యూట్‌ ప్రమాణాలు, వెలుతురులేమి రూపం లో పలు అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా నిర్వాహకులు మొత్తానికి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) తొలి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం ముగిసిన ఆఖరిదైన నాలుగో రౌండ్‌లో గాడ్‌స్పీడ్‌ కొచ్చి డ్రైవర్లు దుమ్మురేపారు. వీరి దెబ్బకు నాలుగో రౌండ్‌ ముందు వరకు 301.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ జట్టు చివరి రౌండ్‌లో టైటిల్‌ కోల్పోవాల్సి వచ్చింది. క్వాలిఫయర్‌-1లో నిఖిల్‌ బొహ్రా-రుహాన్‌ అల్వా (కొచ్చి) టాప్‌లో నిలిచి పోల్‌ పొజిషన్‌ సొంతం చేసుకున్నారు. క్వాలిఫయర్‌-2లో అలిస్టర్‌ యంగ్‌, ఫాబిన్నె ఓల్వెండ్‌ (కొచ్చి) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన స్ర్పింట్‌-1 రేసులో అలిస్టర్‌, స్ర్పింట్‌-2లో నిఖిల్‌-రుహాన్‌ (కొచ్చి) అగ్రస్థానాలు దక్కించుకున్నారు. ఆఖరిదైన స్ర్పింట్‌-3లోనూ అలిస్టర్‌-నిఖిల్‌ ప్రథమ స్థానంలో నిలిచి రేసును ముగించారు. నాలుగో రౌండ్‌లో కొచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఓవరాల్‌గా ఆ జట్టు 417.5 పాయింట్లతో టైటిల్‌ కైవసం చేసుకోగా, హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ 385 పాయింట్లతో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగతంగా డ్రైవర్స్‌ విభాగంలో హైదరాబాద్‌ డ్రైవర్‌ అఖిల్‌ రబీంద్ర చాంపియన్‌ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2022-12-12T05:00:29+05:30 IST