విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు వేదికలు అహ్మదాబాద్‌, కోల్‌కతా

ABN , First Publish Date - 2022-01-23T08:32:40+05:30 IST

వచ్చేనెల 6 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ ఆడే వన్డే, టీ20 సిరీస్‌ వేదికల్లో మార్పులను బీసీసీఐ శనివారం ప్రకటించింది.

విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు   వేదికలు అహ్మదాబాద్‌, కోల్‌కతా

న్యూఢిల్లీ: వచ్చేనెల 6 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ ఆడే వన్డే, టీ20 సిరీస్‌ వేదికల్లో మార్పులను బీసీసీఐ శనివారం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆతిథ్య భారత్‌, విండీస్‌ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు వరుసగా అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, కటక్‌, విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగాలి. అయితే, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీ్‌సకు వేదికలను ఆరు నుం చి రెండుకే పరిమితం చేసినట్లు బోర్డు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం 3 వన్డే (ఫిబ్రవరి 6, 9, 11)లకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం, 3 టీ20 (ఫిబ్రవరి 16, 18, 20)లకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ఆతిథ్యమివ్వనున్నాయి. 

Read more