సిరీస్‌ ఇంగ్లండ్‌దే

ABN , First Publish Date - 2022-10-04T09:04:40+05:30 IST

పాకిస్థాన్‌తో ఏడో, ఆఖరి టీ20లో ఇంగ్లండ్‌ 67 పరుగులతో నెగ్గింది. దాంతో సిరీస్‌ను 4-3తో దక్కించుకుంది.

సిరీస్‌ ఇంగ్లండ్‌దే

ఆఖరి టీ20లో పాక్‌ ఓటమి

లాహోర్‌: పాకిస్థాన్‌తో ఏడో, ఆఖరి టీ20లో ఇంగ్లండ్‌ 67 పరుగులతో నెగ్గింది. దాంతో సిరీస్‌ను 4-3తో దక్కించుకుంది. తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 209/3తో భారీ స్కోరు చేసింది. మలాన్‌ (78 నాటౌట్‌), హ్యారీ బ్రూక్‌ (46 నాటౌట్‌) సత్తాచాటారు. ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లో 142/8 స్కోరుకే పరిమితమైంది. షాన్‌ మసూద్‌ (56) హాఫ్‌ సెంచరీ చేశాడు. వోక్స్‌ మూడు, విల్లే రెండు వికెట్లు పడగొట్టారు. 

Read more