సెమీస్‌కు అర్జున్‌

ABN , First Publish Date - 2022-09-24T09:26:59+05:30 IST

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తున్నాడు.

సెమీస్‌కు అర్జున్‌

ప్రజ్ఞానంద అవుట్‌

జూలియస్‌ బేర్‌ చెస్‌


న్యూయార్క్‌: తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి జూలియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో అర్జున్‌ సెమీఫైనల్‌కు చేరాడు. అమెరికా టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ క్రిస్టోఫర్‌ యోతో క్వార్టర్‌ఫైనల్‌ పోరులో అర్జున్‌ టైబ్రేక్‌ ద్వారా విజయం సాధించాడు. ఇరువురి మధ్య పోరులో తొలుత నాలుగు ర్యాపిడ్‌ గేమ్‌లు 2-2తో డ్రాగా ముగిశాయి. దీంతో అనివార్యమైన బ్లిట్జ్‌ టైబ్రేక్‌లో అర్జున్‌ గెలిచి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు. మరో భారత స్టార్‌ ఆటగాడు ప్రజ్ఞానంద పోరు క్వార్టర్స్‌కే పరిమితమైంది. క్వార్టర్‌ఫైనల్లో ప్రజ్ఞానంద 1-3 తేడాతో జర్మనీకి చెందిన విన్సెంట్‌ కేమర్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక.. సెమీఫైనల్స్‌లో లీమ్‌ కాంగ్‌ లీ(వియత్నాం)తో అర్జున్‌, విన్సెంట్‌తో కార్ల్‌సన్‌ తలపడతారు. 

Read more