ముకేశ్‌, రజత్‌కు పిలుపు

ABN , First Publish Date - 2022-10-03T09:31:46+05:30 IST

దేశవాళీల్లో అదరగొడుతున్న క్రికెటర్లు ముకేశ్‌ కుమార్‌, రజత్‌ పటీదార్‌ ప్రతిభకు ఫలితం దక్కింది.

ముకేశ్‌, రజత్‌కు పిలుపు

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా

న్యూఢిల్లీ: దేశవాళీల్లో అదరగొడుతున్న క్రికెటర్లు ముకేశ్‌ కుమార్‌, రజత్‌ పటీదార్‌ ప్రతిభకు ఫలితం దక్కింది. బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌, మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌కు ఈనెల 6వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. జాతీయ వన్డే జట్టుకు ఎంపికవడం ఇద్దరికీ ఇదే తొలిసారి. సఫారీలతో సిరీ్‌సకు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్‌. తొలి వన్డే 6న లఖ్‌నవూలో, రెండోది 9న రాంచీలో, మూడో మ్యాచ్‌ 11న ఢిల్లీలో జరుగుతాయి. 

జట్టు: ధవన్‌ (కెప్టెన్‌), శ్రేయాస్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌, గిల్‌, రజత్‌ పటీదార్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ (వికెట్‌ కీపర్‌), శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), షాబాజ్‌, శార్దూల్‌, కుల్దీప్‌, బిష్ణోయి, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌. 

Read more