బుమ్రా, హర్షల్‌ వచ్చేశారు

ABN , First Publish Date - 2022-09-13T09:11:09+05:30 IST

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ కోసం సోమవారం జాతీయ సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు.

బుమ్రా, హర్షల్‌ వచ్చేశారు

టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా ఎంపిక

స్టాండ్‌బైగా షమి 

ఆసీస్‌, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకూ జట్ల ప్రకటన

న్యూఢిల్లీ:  ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ కోసం సోమవారం జాతీయ సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఇటీవలే ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే రోహిత్‌ నేతృత్వంలోని 15 మందితో కూడిన ఈ జాబితాలో ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఇక, ఆల్‌రౌండర్‌ జడేజా గాయంతో దూరమైన విషయం తెలిసిందే. ఇందులో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లోనే పాక్‌ను ఎదుర్కోనుంది. ఇక ఈ టోర్నీతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టీ20 సిరీ్‌సలకు కూడా భారత జట్లను ప్రకటించారు. ఈనెల 20 నుంచి ఆసీ్‌సతో, 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సలు జరుగుతాయి.


షమికి చోటు:

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి తిరిగి పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఆసియాక్‌పలో షమి లేకపోవడం భారత అవకాశాలను దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం నలుగురితో పాటు అతడిని స్టాండ్‌బైగా ఉంచినా.. అంతకన్నా ముందు  ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో సిరీ్‌సలకు మాత్రం నేరుగా ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పర్యటన తర్వాత షమి క్రికెట్‌కు దూరంగా ఉండడంతో ముందుగా ఈ రెండు సిరీ్‌సల ద్వారా అతడి సత్తాను పరీక్షించే చాన్సుంది. అలాగే డెత్‌ ఓవర్లలో ఏమేరకు ప్రభావం చూపగలడనే అంశాన్ని కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ అంచనా వేయనున్నారు. మరోవైపు పని ఒత్తిడిలో భాగంగా ఆసీ్‌సతో సిరీ్‌సకు అర్ష్‌దీ్‌ప, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతినిచ్చారు.


అలాగే 37 ఏళ్ల వెటరన్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ వరల్డ్‌కప్‌ బెర్త్‌ను దక్కించుకుని తన కల నెరవేర్చుకున్నాడు. 2010- 2017 మధ్య ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కూడా ఆడని డీకే.. ‘కలలు నిజమవుతాయి’ అనే ట్వీట్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పంత్‌, కార్తీక్‌ల ఎంపికతో మరో కీపర్‌ శాంసన్‌కు నిరాశే మిగిలింది. పంత్‌కు టీ20ల్లో మెరుగైన రికార్డు లేకపోయినా అతడు ఎడమచేతి వాటం ఆటగాడవడంతో ఆసీస్‌ బౌన్సీ పిచ్‌లపై ప్రయోజనం ఉంటుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.


అవేశ్‌పై వేటు

టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇతర రెండు సిరీ్‌సలకు కూడా దాదాపుగా ఆసియాక్‌పలో తలపడిన జట్టుపైనే సెలెక్టర్లు నమ్మకముంచారు. అయితే ఇటీవలి కాలంలో ఏమాత్రం ప్రభావం చూపని పేసర్‌ అవేశ్‌ ఖాన్‌తో పాటు లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు వరల్డ్‌క్‌పలో చోటు దక్కలేదు. బిష్ణోయ్‌ను మాత్రం స్టాండ్‌బైగా ఉంచారు. హర్షల్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే అవేశ్‌పై వేటు పడుతుందని ముందే భావించారు. ఎందుకంటే డెత్‌ ఓవర్లలో అతడి ఎకానమీ రేటు 18గా ఉండడంతో జట్టు ధారాళంగా పరుగులిచ్చుకుంటోంది. ఆసీ్‌సలో అశ్విన్‌ మెరుగైన రికార్డు కారణంగా బిష్ణోయ్‌ను తప్పించారు. అలాగే ప్రత్యర్థి జట్లలోని ఎడమచేతి బ్యాటర్స్‌ను ఇబ్బందిపెట్టడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌ ఉపయోగపడగలడు.

   

ఇదే మన సైన్యం

వరల్డ్‌కప్‌ జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.


స్టాండ్‌బై:

షమి, శ్రేయాస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్‌ చాహర్‌.


ఆసీస్‌తో సిరీస్‌కు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, షమి.


దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), కోహ్లీ, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, షమి, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా.

Read more