జిబ్రాల్టర్‌ జలసంధిని ఈదిన ఆంధ్ర స్విమ్మర్లు

ABN , First Publish Date - 2022-07-05T10:05:43+05:30 IST

జిబ్రాల్టర్‌ జలసంధిని ఆంధ్ర స్విమ్మర్లు ఎం.తులసీ చైతన్య, టి.విశ్వనాథ్‌ అలవోకగా ఈది సంచలనం సృష్టించారు.

జిబ్రాల్టర్‌ జలసంధిని ఈదిన   ఆంధ్ర స్విమ్మర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి):  జిబ్రాల్టర్‌ జలసంధిని ఆంధ్ర స్విమ్మర్లు ఎం.తులసీ చైతన్య, టి.విశ్వనాథ్‌ అలవోకగా ఈది సంచలనం సృష్టించారు. చైతన్య, విశ్వనాథ్‌ కలిసి స్పెయిన్‌ (ఐరోపా)లోని టరిఫా నుంచి మొరాకో (ఆఫ్రికా)లోని పాయింట్‌ సైరిస్‌ వరకు గల 15.1 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 25 నిమిషాల వ్యవధిలో ఈదా రు. వీరిరువురి స్వస్థలం విజయవాడ. చైతన్య విజయవాడ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, పలు జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పతకాలు సాధించిన విశ్వనాథ్‌ ప్రస్తుతం జర్మనీలో ఎంఎస్‌ చేస్తున్నాడు.

Read more