సూర్యకుమార్‌ @ 2

ABN , First Publish Date - 2022-09-29T10:42:54+05:30 IST

స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌ టీ20లో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య (36 బంతుల్లో 69)

సూర్యకుమార్‌ @ 2

దుబాయ్‌: స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌ టీ20లో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య (36 బంతుల్లో 69)తాజాగా రెండో ర్యాంకుకు చేరుకొన్నాడు. 801 రేటింగ్‌ పాయింట్లు సాధించిన అతడు.. అగ్రస్థానానికి అడుగుదూరంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ కూడా ఒకస్థానం ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరాడు. పాకిస్థాన్‌ కీపర్‌ రిజ్వాన్‌ (861) టాప్‌లో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (33 నుంచి 18వ ర్యాంక్‌), చాహల్‌ (28 నుంచి 26) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. 

Read more