రజతంతో మెరిసిన శ్రీజ-స్నేహిత్‌

ABN , First Publish Date - 2022-09-25T09:06:46+05:30 IST

నేషనల్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి.

రజతంతో మెరిసిన శ్రీజ-స్నేహిత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): నేషనల్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ 1-4తో సుతిరిత ముఖర్జీ (పశ్చిమ బెంగాల్‌) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. అనంతరం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్నేహిత్‌-శ్రీజ జోడీ 0-4తో మనుష్‌ షా-క్రిత్వికా సిన్హా రాయ్‌ (గుజరాత్‌) చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకున్నారు. 

Read more