ఆఖరి బంతికి శ్రీలంక విజయం

ABN , First Publish Date - 2022-10-14T09:01:07+05:30 IST

గురువారం ఉత్కంఠగా సాగిన రెండో సెమీ్‌సలో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. తద్వారా 14ఏళ్ల తర్వాత లంక ఆసియాకప్‌

ఆఖరి బంతికి శ్రీలంక విజయం

గురువారం ఉత్కంఠగా సాగిన రెండో సెమీ్‌సలో శ్రీలంక ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. తద్వారా 14ఏళ్ల తర్వాత లంక ఆసియాకప్‌ ఫైనల్లో ప్రవేశించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 122/6 స్కోరు సాధించింది. మడవి (35) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో పాక్‌ 20 ఓవర్లలో 121/6 స్కోరు చేసి ఓడింది. మరూఫ్‌ (42), నిదా దర్‌ (26) పోరాడారు. చివరి బంతికి 3 రన్స్‌ కావాల్సి ఉండగా రెండో రన్‌ కోసం ప్రయత్నించి నిదా రనౌట్‌ కావడంతో లంక సంబరాల్లో మునిగింది.

Read more