ప్లేఆఫ్స్‌, ఫైనల్‌కు పూర్తిస్థాయి ప్రేక్షకులు

ABN , First Publish Date - 2022-04-24T10:45:22+05:30 IST

ప్లేఆఫ్స్‌, ఫైనల్‌కు పూర్తిస్థాయి ప్రేక్షకులు

ప్లేఆఫ్స్‌, ఫైనల్‌కు పూర్తిస్థాయి ప్రేక్షకులు

లఖ్‌నవూలో మే 24 నుంచి మహిళల ఐపీఎల్‌

దక్షిణాఫ్రికాతో మూడో టీ20కి వైజాగ్‌ ఆతిథ్యం


ముంబై: మహిళల ఐపీఎల్‌ వచ్చేనెల 24 నుంచి 28 వరకు లఖ్‌నవూలో జరగనుంది. ఈ మేరకు శనివారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో బోర్డు నిర్ణయం తీసుకుంది.  అలాగే, పురుషుల ఐపీఎల్‌లో ప్లేఆ్‌ఫ్సతో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు స్టేడియంలో పూర్తిస్థాయి ప్రేక్షకులను అనుమతించనున్నారు. తొలి ప్లేఆఫ్‌ (మే 24), ఎలిమినేటర్‌ (మే 26)కు కోల్‌కతా.. రెండో ప్లేఆఫ్‌ (మే 27), ఫైనల్‌ (మే 29)కు అహ్మదాబాద్‌ ఆతిథ్యమిస్తున్నాయి. అలాగే భారత్‌లో దక్షిణాఫ్రికాతో ఐదు టీ-20 సిరీస్‌లో భాగంగా.. జూన్‌ 9న ఢిల్లీలో తొలి మ్యాచ్‌, 12న కటక్‌లో రెండోది, 14న వైజాగ్‌లో మూడో టీ20, 17న నాలుగోది రాజ్‌కోట్‌లో, ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ 19న బెంగళూరులో జరగనున్నాయి.    

Read more