మెస్సీకి పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-03T09:19:47+05:30 IST

మెస్సీకి పాజిటివ్‌

మెస్సీకి పాజిటివ్‌

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కోచ్‌  సిల్వర్‌వుడ్‌, మెక్‌గ్రాత్‌కు కూడా


పారిస్‌/మెల్‌బోర్న్‌: ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా వైరస్‌ క్రమంగా క్రీడా రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఆదివారం పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీతోపాటు మరో ముగ్గురు పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎ్‌సజీ) క్లబ్‌ ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. వానెస్‌ జట్టుతో సోమవారం రాత్రి జరగాల్సిన ఫ్రెంచ్‌ కప్‌ మ్యాచ్‌కు ముందు పీఎ్‌సజీ జట్టుకు నిర్వహించిన కరోనా పరీక్షలో వీరంతా పాజిటివ్‌గా తేలారు. అలాగే ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ సిల్వర్‌వుడ్‌కు కరోనా సోకింది. గత గురువారం నిర్వహించిన పరీక్షల్లో సిల్వర్‌వుడ్‌ కుటుంబసభ్యుల్లో ఒకరు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో సిల్వర్‌వుడ్‌ కూడా పాజిటివ్‌గా తేలడంతో ఈనెల 8వరకు అతడి కుటుంబం మెల్‌బోర్న్‌లో ఐసోలేషన్‌లో ఉండనుంది. దాంతో బుధవారం నుంచి సిడ్నీలో జరిగే యాసెస్‌ నాలుగో టెస్ట్‌కు సిల్వర్‌వుడ్‌ దూరం కానున్నాడు. సిల్వర్‌వుడ్‌తోపాటు పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ జోన్‌ లూయిస్‌, స్పిన్‌ మెంటార్‌ జీతన్‌ పటేల్‌, స్ట్రెంథనింగ్‌ కోచ్‌ డారెన్‌ వెనెస్‌ కూడా పాజిటివ్‌గా తేలారు. ఆస్ట్రేలియా దిగ్గజ పేస్‌ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సైతం కరోనా బారినపడ్డాడు. ఈనెల 5 నుంచి ఇక్కడ జరిగే యాషెస్‌ నాలుగో మ్యాచ్‌ను..బ్రె్‌స్ట కేన్సర్‌తో మరణించిన మెక్‌గ్రాత్‌ భార్య జేన్‌ సంస్మరణార్థం ‘పింక్‌ టెస్ట్‌’గా పిలుస్తున్నారు. ఈ టెస్ట్‌ మూడో రోజును ‘జేన్‌ మెక్‌గ్రాత్‌ డే’గా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెక్‌గ్రాత్‌ ఈ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉన్న తరుణంలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. దాంతో ఆసీస్‌, ఇంగ్లండ్‌ జట్లకు అందజేసే పింక్‌ బ్యాగీ క్యాప్‌ కార్యక్రమాన్ని మెక్‌గ్రాత్‌ వర్చువల్‌గా తిలకించనున్నాడు. 

Read more