కుల్దీప్‌ హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2022-09-26T10:15:12+05:30 IST

కుల్దీప్‌ హ్యాట్రిక్‌

కుల్దీప్‌ హ్యాట్రిక్‌

చెనై: లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/51) హ్యాట్రిక్‌తోపాటు పృథ్వీ షా (48 బంతుల్లో 77) ధనాధన్‌ బ్యాటింగ్‌తో.. ఆదివారం జరిగిన రెండో అనధికార వన్డేలో భారత్‌-ఎ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌-ఎపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను మరో వన్డే మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌-ఎ 47 ఓవర్లలో 219 పరుగులకు కుప్పకూలింది. కార్టర్‌ (72), రచిన్‌ (61) అర్ధ శతకాలు సాధించారు. కివీస్‌ 210/6 స్కోరువద్ద ఉన్నప్పుడు.. హ్యాట్రిక్‌ సహా చివరి 4 వికెట్లను కుల్దీప్‌ పడగొట్టాడు. 47వ ఓవర్‌లో ఆఖరి 3 బంతుల్లో లోగన్‌ (4), వాకర్‌ (0), జాకబ్‌ (0)ను వరుసగా పెవిలియన్‌ చేర్చిన యాదవ్‌.. కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఛేదనలో భారత్‌-ఎ 34 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీషాతోపాటు శాంసన్‌ (37), రుతురాజ్‌ (30) రాణించారు. 

Read more