‘వెస్ట్‌’దే దులీప్‌ ట్రోఫీ

ABN , First Publish Date - 2022-09-26T10:13:29+05:30 IST

‘వెస్ట్‌’దే దులీప్‌ ట్రోఫీ

‘వెస్ట్‌’దే దులీప్‌ ట్రోఫీ

294 పరుగులతో సౌత్‌జోన్‌ చిత్తు


కోయంబత్తూర్‌: వెస్ట్‌జోన్‌ జట్టు దులీప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆ జట్టు 294 పరుగుల భారీ తేడాతో సౌత్‌జోన్‌పై ఘన విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ 154/6 స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌ లంచ్‌కుముందే 234 రన్స్‌కు ఆలౌటైంది. కిందటిరోజు బ్యాటర్లు రవితేజ  (53), సాయికిశోర్‌ (7) ఆదివారం ఉదయం రెండు గంటలపాటు ప్రత్యర్థి బౌలర్లను విసిగించారు. సాయికిశోర్‌ నిష్క్రమించాక కృష్ణప్ప గౌతమ్‌ (17) కొద్దిసేపు రవితేజకు సహకరించాడు. యశస్వీ జైస్వాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా, ఉనాద్కట్‌  ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచారు. 

Read more