ఓ శకం ముగిసింది

ABN , First Publish Date - 2022-09-26T10:10:22+05:30 IST

ఓ శకం ముగిసింది

ఓ శకం ముగిసింది

జులన్‌ రిటైర్మెంట్‌పై బీసీసీఐ


న్యూఢిల్లీ: భారత పేసర్‌ జులన్‌ గోస్వామి రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందని బీసీసీఐ వ్యాఖ్యానించింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేతో 39 ఏళ్ల జులన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘కెరీర్‌ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన గోస్వామి భారత క్రికెట్‌కు వన్నె తెచ్చింది’ అని బోర్డు అధ్యక్షుడు గంగూలీ ఓ ప్రకటనలో ప్రశంసలు కురిపించాడు. ‘తన అద్భుత నైపుణ్యంతో సంవత్సరాలపాటు భారత పేస్‌ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచింది. యువ క్రికెటర్లకు జులన్‌ స్ఫూర్తిగా నిలుస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న గోస్వామికి శుభాకాంక్షలు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నాడు.

Read more