కిరియోస్‌ అవుట్‌చీ

ABN , First Publish Date - 2022-09-08T10:21:42+05:30 IST

కిరియోస్‌ అవుట్‌చీ

కిరియోస్‌ అవుట్‌చీ

సెమీ్‌సలో ఖచనోవ్‌, రూడ్‌

మహిళల్లో గార్సియా, సబలెంకా, జెబ్యూర్‌


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఆరోసీడ్‌ అరియానా సబలెంకా,  ఓన్స్‌ జెబ్యూర్‌, కరోలిన్‌ గార్సియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ ఏడాది వింబుల్డన్‌లో ఫైనల్‌ చేరి రికార్డు సృష్టించిన ట్యునీషియా నెంబర్‌వన్‌ క్రీడాకారిణి ఓన్స్‌ జెబ్యూర్‌ యూఎస్‌ ఓపెన్‌లో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్‌ జెబ్యూర్‌ 6-4, 7-6 (7-4)తో ఆస్ట్రేలియాకు చెందిన అల్జా టామ్‌జనోవిచ్‌ను ఓడించింది. ఈ విజయంతో యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన తొలి ఆఫ్రికా మహిళగా 28 ఏళ్ల జెబ్యూర్‌ చరిత్రకెక్కింది. ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్‌ కరోలిన్‌ గార్సియాతో జెబ్యూర్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో మ్యాచ్‌లో 28 ఏళ్ల గార్సియా 6-3, 6-4తో  అమెరికాకు చెందిన 18 ఏళ్ల కొకొ గాఫ్‌పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీ్‌సలో ప్రవేశించింది. అంతేకాదు.. 2006లో అమేలీ మౌరెస్మో తర్వాత ఈ వేదికపై సెమీస్‌ చేరిన తొలి ఫ్రాన్స్‌ మహిళ కరోలినే. మరో మ్యాచ్‌లో సబలెంకా 6-1, 7-6(7-4)తో కరోలినా ప్లిస్కోవాపై గెలుపొందింది.


కిరియో్‌సకు ఖచనోవ్‌ చెక్‌: రష్యాకు చెందిన 26 ఏళ్ల కారెన్‌ ఖచనోవ్‌ యూఎస్‌ ఓపెన్‌తో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో 27వ సీడ్‌ ఖచనోవ్‌ 7-5, 4-6, 7-5, 6-7(3-7), 6-4తో 23వ సీడ్‌ నిక్‌ కిరియో్‌సపై గెలుపొందాడు. గతరౌండ్లో నెంబర్‌వన్‌ మెద్వెదెవ్‌పై అసమాన పోరాటాన్ని ప్రదర్శించిన కిరియోస్‌ ఇక్కడ మాత్రం ఖచనోవ్‌ ధాటికి చేతులెత్తేశాడు. మూడున్నర గంటలకుపైగా సాగిన ఈ ఐదుసెట్ల పోరులో ఖచనోవ్‌ (30) కంటే ఓ ఏస్‌ ఎక్కువగానే సంధించిన కిరియోస్‌ (31) బ్రేక్‌ పాయింట్ల రూపంలో అవకాశాలను చేజార్చుకున్నాడు. తొమ్మిది బ్రేక్‌ పాయింట్లలో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు.  ఇక.. వివాదాస్పదుడిగా తనకున్న చెడ్డపేరును మరోసారి గుర్తుచేస్తూ కిరియోస్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాకెట్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. ఓడానన్న అసహనంలో రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. ఖచనోవ్‌ శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఐదోసీడ్‌ కాస్పర్‌ రూడ్‌తో తలపడనున్నాడు. నార్వేకు చెందిన 23 ఏళ్ల రూడ్‌ 6-1, 6-4, 7-6(7-4)తో 13వ సీడ్‌, గతేడాది వింబుల్డన్‌ రన్నరప్‌ మాట్‌ బెరెటినికి వరుససెట్లలో ఝలకిచ్చాడు.   

Read more