ఫేవరెట్‌ నీరజ్‌

ABN , First Publish Date - 2022-09-08T10:13:55+05:30 IST

ఫేవరెట్‌ నీరజ్‌

ఫేవరెట్‌ నీరజ్‌

నేడు డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌

రాత్రి 11.30 నుంచి స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో

 

జ్యూరిచ్‌: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో చరిత్ర లిఖించేందుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఈ ఒలింపిక్‌ చాంపియన్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నాడు. గాయంతో నెలపాటు ట్రాక్‌కు దూరంగా ఉన్న నీరజ్‌.. లొజాన్‌ (స్విట్జర్లాం డ్‌) డైమండ్‌ లీగ్‌లో విజేతగా నిలిచి.. రెండు రోజుల ఈ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) పరోక్షంలో చోప్రా సహా ఆరుగురు అథ్లెట్లు జ్యూరిచ్‌ ఫైనల్స్‌లో తలపడుతున్నారు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఒలింపిక్‌ రజత పతక విజేత యాకోబ్‌ వ్లాడిచ్‌నుంచి చోప్రాకు ప్రధానంగా పోటీ ఎదురవనుంది. అయితే లొజాన్‌ లీగ్‌లో వ్లాడిచ్‌ను ఓడించి నీరజ్‌ విజేతగా నిలవడం గమనార్హం. 

Read more