రొనాల్డో@ 700

ABN , First Publish Date - 2022-10-11T09:01:58+05:30 IST

సాకర్‌ కింగ్‌ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు.

రొనాల్డో@ 700

లివర్‌పూల్‌ (ఇంగ్లండ్‌): సాకర్‌ కింగ్‌ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో భాగంగా ఎవర్టన్‌ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఆటగాడు రొనాల్డో గోల్‌ సాధించాడు. రొనాల్డోకిది క్లబ్‌స్థాయిలో 700వ గోల్‌. దీంతో క్లబ్‌స్థాయిలో అత్యధిక గోల్స్‌ చేసిన ఫుట్‌బాలర్‌గా రొనాల్డో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా, అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యధిక గోల్స్‌ పరంగానూ రొనాల్డో (117)దే రికార్డు. క్లబ్‌ స్థాయిలో 691, అంతర్జాతీయ స్థాయిలో 90 గోల్స్‌తో మెస్సీ రెండోస్థానంలో ఉన్నాడు. 

Read more