‘వియత్నాం’ సెమీస్ లో సిక్కి జోడీ

ABN , First Publish Date - 2022-10-01T09:57:31+05:30 IST

డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ సిక్కి రెడ్డి మళ్లీ ఫామ్‌లోకొచ్చింది. ఈ తెలుగమ్మాయి రోహన్‌ కపూర్‌ జతగా వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌..

‘వియత్నాం’ సెమీస్ లో సిక్కి జోడీ

హో చి మిన్‌ సిటీ: డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ సిక్కి రెడ్డి మళ్లీ ఫామ్‌లోకొచ్చింది. ఈ తెలుగమ్మాయి రోహన్‌ కపూర్‌ జతగా వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్‌ సిక్కి-రోహన్‌ ద్వయం 21-19, 21-17తో మలేసియాకు చెందిన మూడోసీడ్‌ జంట చాన్‌ పెంగ్‌ సూన్‌-చే యే సీను వరుసగేముల్లో చిత్తుచేసింది. ఫైనల్‌ బెర్త్‌ కోసం టాప్‌సీడ్‌ రేహన్‌ నఫుల్‌-లిసా ఆయు (ఇండోనేసియా) జోడీతో సిక్కి జంట తలపడనుంది. 

Read more