‘ఢిల్లీ’ అసిస్టెంట్‌కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

ABN , First Publish Date - 2022-03-16T09:12:58+05:30 IST

ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అసిస్టెం ట్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ నియమితు డయ్యాడు.

‘ఢిల్లీ’ అసిస్టెంట్‌కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

ముంబై: ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అసిస్టెం ట్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ నియమితు డయ్యాడు. 40 ఏళ్ల వాట్సన్‌.. రికీ పాంటింగ్‌ (చీఫ్‌ కోచ్‌), ప్రవీణ్‌ ఆమ్రే (అసిస్టెంట్‌ కోచ్‌), అజిత్‌ అగార్కర్‌ (అసిస్టెంట్‌ కోచ్‌), జేమ్స్‌ హోప్స్‌ (బౌలింగ్‌ కోచ్‌)లతో కలిసి కోచింగ్‌ బృందంలో పని చేయనున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. గతంలో వాట్సన్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌, బెంగళూరు, చెన్నై జట్లకు ఆడిన సంగతి తెలిసిందే.

Read more