న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీస్‌.. భారత్‌ ‘ఎ’లో తిలక్‌, భరత్‌

ABN , First Publish Date - 2022-08-25T10:18:41+05:30 IST

న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీస్‌.. భారత్‌ ‘ఎ’లో తిలక్‌, భరత్‌

న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీస్‌.. భారత్‌ ‘ఎ’లో తిలక్‌, భరత్‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీ్‌సకు భారత్‌ ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా గుజరాత్‌ ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ నియమితుడయ్యాడు. అలాగే ఈ జట్టులో తెలుగు క్రికెటర్లు తిలక్‌ వర్మ, కేఎస్‌ భరత్‌లకు కూడా చోటు దక్కింది. ఈ టూర్‌లో భాగంగా నాలుగు రోజుల మ్యాచ్‌లు మూడింటిలో ఇరుజట్లు తలపడనున్నాయి తొలి, మూడు మ్యాచ్‌లు బెంగళూరులో, రెండో పోటీ హుబ్లీలో జరుగుతాయి. ఇక మూడు వన్డే మ్యాచ్‌లకు చెన్నైని వేదికగా ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లకు భారత జట్టును తర్వాత ప్రకటిస్తారు. 

Read more