సెనెగల్‌ ముందుకు..

ABN , First Publish Date - 2022-11-30T02:04:14+05:30 IST

చావోరేవో మ్యాచ్‌లో కలిడౌ కౌలిబాలి విన్నింగ్‌ గోల్‌తో.. ఆఫ్రికా జట్టు సెనెగల్‌ నాకౌట్‌కు చేరుకొంది.

సెనెగల్‌ ముందుకు..

దోహా: చావోరేవో మ్యాచ్‌లో కలిడౌ కౌలిబాలి విన్నింగ్‌ గోల్‌తో.. ఆఫ్రికా జట్టు సెనెగల్‌ నాకౌట్‌కు చేరుకొంది. గ్రూప్‌- ఎలో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో సెనెగల్‌ 2-1తో ఈక్వెడార్‌పై గెలిచింది. మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంతో ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధిం చింది. సెనెగల్‌ తరఫున ఇస్మయిల (44వ), కౌలిబాలి (70) గోల్స్‌ చేయగా.. ఈక్వెడార్‌ ప్లేయర్‌ మోసెస్‌ కైసిడో (67వ) గోల్‌ సాధించాడు. మూడు మ్యాచ్‌లాడి 4 పాయింట్లతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన ఈక్వెడార్‌ ఇంటిముఖం పట్టింది.

Updated Date - 2022-11-30T02:04:14+05:30 IST

Read more