‘బంగారు’ భాగ్యలక్ష్మి

ABN , First Publish Date - 2022-02-23T08:56:19+05:30 IST

ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి ప్‌లో తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి స్వర్ణ పతకంతో మెరిసింది.

‘బంగారు’ భాగ్యలక్ష్మి

వరల్డ్‌ వర్సిటీ గేమ్స్‌కు ఎంపిక

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి ప్‌లో తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి స్వర్ణ పతకంతో మెరిసింది. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 1500 మీటర్ల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ తరపున బరిలోకి దిగిన భాగ్యలక్ష్మి 4 నిమిషాల 27 సెకన్లలో రేసును ముగించి చాంపియన్‌గా నిలిచింది. కురుక్షేత్ర విశ్వవిద్యాల యానికి చెందిన వర్షకు రజతం, హిమాచల్‌ప్రదేశ్‌ వర్సిటీ అమ్మాయి సునీత కాంస్యం అందుకున్నారు. ఈ ప్రదర్శనతో భాగ్యలక్ష్మి వచ్చే జూన్‌లో చైనాలో జరగనున్న ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసు కుంది. భాగ్యలక్ష్మి స్వస్థలం నాగర్‌కర్నూల్‌ కాగా, ఇబహ్రీంప ట్నంలోని తెలంగాణ సాంఘిక గురుకులాల మహిళల డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఇక, ఇవే పోటీల్లో 100 మీ. స్ర్పింట్‌ లో కళింగ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన భారత స్టార్‌ అథ్లెట్‌ ద్యూతీచంద్‌ 11.44 సెకన్లలో రేసును పూర్తి చేసి పసిడి పతకం సాధించింది.

Updated Date - 2022-02-23T08:56:19+05:30 IST