అత్యంత వేగవంతమైన భారతీయుడిగా రికార్డులకెక్కిన సీన్ రోజర్స్

ABN , First Publish Date - 2022-05-17T00:10:47+05:30 IST

సీజన్ రోజర్స్ (Sean Rogers).. ఇప్పుడీ పేరు దేశంలో మార్మోగుతోంది. గత పుష్కర కాలంగా డ్రాగ్ రేసింగ్‌తోపాటు

అత్యంత వేగవంతమైన భారతీయుడిగా రికార్డులకెక్కిన సీన్ రోజర్స్

న్యూఢిల్లీ: సీజన్ రోజర్స్ (Sean Rogers).. ఇప్పుడీ పేరు దేశంలో మార్మోగుతోంది. గత పుష్కర కాలంగా డ్రాగ్ రేసింగ్‌తోపాటు ఆటోక్రాస్ వేరియంట్లలో అనుభవజ్ఞుడైన రేసర్‌గా పేరుగాంచిన సీన్.. తాజాగా, అంత్యంత వేగవంతమైన భారతీయుడిగా రికార్డులకెక్కాడు. గంటకు 329.83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ ఘనత సాధించాడు.


రేసింగ్ పట్ల ఆయనకున్న అభిరుచికి ఇది మరో తార్కాణం. ఇప్పటికే 80కిపైగా అవార్డులు అందుకున్న సీన్ రేజర్స్‌కు కార్లు, బైక్‌లంటే ఎనలేని ఆసక్తి. ఒక్కసారి ట్రాక్‌పైకి వెళ్లాడంటే తనకంటే ఎంతటి అనుభవజ్ఞుడు ఉన్నా చిత్తైపోవాల్సిందే. ప్రముఖ రేసర్లు అయిన అవినాష్ యెనిగళ్ల, సందీప్ నడింపల్లి వంటి వారి మద్దతు సీన్ రేజర్స్‌కు పుష్కలంగా ఉంది. 


 నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్(NATRAX) వద్ద తన అద్భుత ప్రదర్శనపై సీన్ మాట్లాడుతూ.. రేస్‌లో విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేమని పేర్కొన్నాడు. ట్రాక్‌పై చురుగ్గా ఉండడం, ఇంజిన్ శబ్దం వింటూ దూసుకుపోవడం ఒకటే తనకు తెలుసని అన్నాడు.


సీన్ బెంగళూరు వ్రూమ్ డ్రాగ్ రేసులో ఇటీవల వరుసగా మూడు విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు, ‘ఫాస్టెస్ట్‌ డ్రైవర్‌ ఆఫ్‌ ద ఈవెంట్స్‌ ఇన్‌ ఆటోక్రాస్‌’, ‘ఫాస్టెస్ట్‌ ఇన్‌ ఫారిన్‌ కార్‌ అండ్‌ బైక్‌ డ్రాగ్‌ రేసెస్‌’ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ కూడా గెలుచుకున్నాడు. యువ రేసర్లకు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సీన్ పేర్కొన్నాడు. 

Read more