India tennis star Sania Mirza: సానియామీర్జా తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఏం రాసిందంటే...

ABN , First Publish Date - 2022-08-23T14:37:25+05:30 IST

ఇండియా టెన్నిస్ స్టార్(India tennis star) సానియా మీర్జా(Sania Mirza) మంగళవారం పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) పోస్టులో...

India tennis star Sania Mirza: సానియామీర్జా తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఏం రాసిందంటే...

హైదరాబాద్ : ఇండియా టెన్నిస్ స్టార్(India tennis star) సానియా మీర్జా(Sania Mirza) మంగళవారం పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) పోస్టులో తనకు గాయమైందనే విషయం బయటపెట్టారు.నా మోచేతికి గాయం(Due To Injury) కారణంగా రాబోయే యూఎస్ ఓపెన్(US Open) నుంచి వైదొలిగినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియామీర్జా ప్రకటించారు. తనకు అయిన గాయం తన రిటైర్మెంట్ ప్రణాళికను(retirement plan) మారుస్తుందని ఆమె పేర్కొన్నారు.


‘‘హాయ్ అబ్బాయిలు...తాజా అప్‌డేట్. నా దగ్గర అంత గొప్ప వార్తలు లేవు. రెండు వారాల క్రితం కెనడాలో(Canada) ఆడుతున్నప్పుడు నా మోచేతికి గాయమైంది, నేను నిన్న స్కానింగ్ చేయించే వరకు అది ఎంత పెద్ద గాయమో అర్థం కాలేదు... దురదృష్టవశాత్తు నా మోచేయి వద్ద ఉన్న నరం కొద్దిగా దెబ్బతింది’’ అని మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.(Sania Mirza wrote)తాను కొద్దివారాల పాటు టెన్నిస్ కు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.


సానియా మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థాయికి చేరారు. మహిళల డబుల్స్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్,యూఎస్ ఓపెన్‌లను ఒక్కోసారి గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ యుఎస్ ఓపెన్‌లను ఒక్కోసారి గెలిచింది.ఈ ఏడాది చివరిలో తాను రిటైర్ కానున్నట్లు సానియామీర్జా గతంలో ప్రకటించింది. తనకు టెన్నిస్ ఎల్లప్పుడూ జీవితంలో(life) చాలా ముఖ్యమైన(important) భాగంగా ఉంటుందని సానియా మీర్జా వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-08-23T14:37:25+05:30 IST