‘మాంచెస్టర్‌’కు రొనాల్డో బైబై

ABN , First Publish Date - 2022-11-24T01:20:26+05:30 IST

మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతో

‘మాంచెస్టర్‌’కు రొనాల్డో బైబై

దోహా: మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతో అతడితో కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు క్లబ్‌ బుధవారం వెల్లడించింది. 37 ఏళ్ల రొనాల్డో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తోపాటు..జట్టు మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో క్లబ్‌కు రొనాల్డో గుడ్‌బై చెప్పనున్నాడని అంతా భావించారు. 346 మ్యాచ్‌ల్లో మాంచెస్టర్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రిస్టియానో 145 గోల్స్‌ చేశాడు.

Updated Date - 2022-11-24T01:20:27+05:30 IST