రాణించిన శ్రేయాస్ అయ్యర్, రాణా.. ఓ మాదిరి స్కోరు చేసిన కోల్‌కతా

ABN , First Publish Date - 2022-04-29T03:04:23+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు

రాణించిన శ్రేయాస్ అయ్యర్, రాణా.. ఓ మాదిరి స్కోరు చేసిన కోల్‌కతా

ముంబై: ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, రింకు సింగ్ కాసేపు క్రీజులో కుదురుకోవడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు అదృష్టం కలిసిరాలేదు. కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌ ముందు కేకేఆర్ బ్యాటర్లు నిలవలేకపోయారు. వచ్చినంత వేగంగా వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు వెళ్లిపోయారు. 


అరోన్ ఫించ్ (3), వెంకటేష్ అయ్యర్ (6), బాబా ఇందర్‌జిత్ (6), సునీల్ నరైన్ (0), ఆండ్రూ రసెల్ (0) వంటి హేమాహేమీలందరూ దారుణంగా నిరాశపరిచారు. అయితే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కాసేపు బౌలర్లను ఎదురొడ్డాడు. 37 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. నితీశ్ రాణా అర్ధ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు కాసేపు పరుగులు పెట్టింది. చివర్లో రింకు సింగ్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా, ముస్తాఫిజుర్ 3, చేతన్ సకారియా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.


Updated Date - 2022-04-29T03:04:23+05:30 IST