ప్రపంచకప్‌ తర్వాత రాహుల్‌ పెళ్లి!

ABN , First Publish Date - 2022-11-08T03:46:55+05:30 IST

తాజా టీ20 ప్రపంచకప్‌ ముగిశాక భారత స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. కొంతకాలంగా బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడు.

ప్రపంచకప్‌ తర్వాత  రాహుల్‌ పెళ్లి!

ముంబై: తాజా టీ20 ప్రపంచకప్‌ ముగిశాక భారత స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. కొంతకాలంగా బాలీవుడ్‌ నటి అతియా శెట్టితో అతడు ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో లేక జనవరి మొదటి వారంలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. గత సెప్టెంబరులోనే అతియా తండ్రి, నటుడు సునీల్‌ శెట్టి కూడా వీరి వివాహంపై స్పష్టతనిచ్చాడు. అలాగే రాహుల్‌ కోరిక మేరకే బీసీసీఐ అతడిని న్యూజిలాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీ్‌సలకు ఎంపిక చేయలేదు. మరోవైపు ఈనెలాఖరులో రాహుల్‌, అతియాల ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-11-08T12:09:46+05:30 IST

Read more