T20 world cup 2022 prize money: టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు దక్కేది ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2022-10-01T00:40:04+05:30 IST

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనలిస్టులకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో నంబరు

T20 world cup 2022 prize money: టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు దక్కేది ఎంతో తెలుసా?

దుబాయ్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)  ఫైనలిస్టులకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో నంబరు 13న జరగున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup ) ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుకు దాదాపు రూ. 13 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) పారితోషికం లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు అందులో సగం అంటే రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా ప్రకటించింది. అక్టోబరు 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. 16 జట్లు ట్రోఫీ కోసం పోటీపడతాయి. మొత్తం 5.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కాగా, సెమీ ఫైనల్ దశలో ఓడిపోయిన జట్లకు చెరో రూ. 3.25 కోట్లు ఇస్తారు. 


సూపర్-12 దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 56 లక్షల చొప్పున చెల్లిస్తారు. తొలి రౌండ్‌లోనే ఓటమి మూటగట్టుకున్న జట్లకు రూ. 32 చొప్పున అందిస్తారు. ఈ టోర్నీలో పాల్గొన్న జట్లలో 8 జట్లు.. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్లు నేరుగా సూపర్ 12లో అడుగుపెడతాయి. మిగతా 8 జట్లు.. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ జట్లు గ్రూప్‌-ఎలో, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇర్లాండ్, జింబాబ్వే గ్రూప్-బిలో ఉన్నాయి. ఇవి తొలి రౌండ్‌లో తలపడతాయి.  

Updated Date - 2022-10-01T00:40:04+05:30 IST