ముంబా.. భళా

ABN , First Publish Date - 2022-11-12T03:22:06+05:30 IST

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో యూ ముంబా జట్టు అదరగొట్టింది. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ముంబా జట్టు 34-33 స్కోరు తేడాతో పుణెరి పల్టన్‌ను ఓడించింది.

ముంబా.. భళా

పీకేఎల్‌లో పల్టాన్‌పై విజయం

పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో యూ ముంబా జట్టు అదరగొట్టింది. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ముంబా జట్టు 34-33 స్కోరు తేడాతో పుణెరి పల్టన్‌ను ఓడించింది. చివరిదాకా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు సత్తాచాటడంతో ఒకే ఒక్క పాయింట్‌ అంతరంతో ముంబాను విజయం వరించింది. ఇక, మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ జట్టు 40-34తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. స్టీలర్స్‌కిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం.

Updated Date - 2022-11-12T03:22:06+05:30 IST

Read more