పాక్‌ విజయ లక్ష్యం 355

ABN , First Publish Date - 2022-12-12T04:55:22+05:30 IST

ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. 355 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య పాక్‌ జట్టు ఆదివారం మూడోరోజు ఆట ముగిసేసరికి రెండో

పాక్‌ విజయ లక్ష్యం 355

ముల్తాన్‌: ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. 355 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య పాక్‌ జట్టు ఆదివారం మూడోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 198/4 స్కోరుతో ఉంది. మరో రెండురోజుల ఆట ఉండగా పాక్‌ గెలుపు కోసం ఇంకా 157 పరుగులు చేయాలి. ఇమాముల్‌ (60), అబ్దుల్లా (45) ఆకట్టుకోగా.. క్రీజులో సౌద్‌ షకీల్‌ (54), ఫహీమ్‌ (3) ఉన్నారు. అంతకుముందు తమ ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 73 పరుగులను జోడించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 275 రన్స్‌కు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (108) సెంచరీ సాధించగా.. డకెట్‌ (79), స్టోక్స్‌ (41) రాణించారు. లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌కు నాలుగు, జాహిద్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Updated Date - 2022-12-12T04:55:22+05:30 IST

Read more