Akhtar shami: షమీ-షోయబ్ అక్తర్ ట్వీటర్ జగడంపై పాక్ మాజీల స్పందన.. ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-11-15T17:51:16+05:30 IST

టీ20 వరల్డ్ కప్ 2022 (t20 world cup) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ (England Vs Pakistan) ఓటమిపాలైంది.

Akhtar shami: షమీ-షోయబ్ అక్తర్ ట్వీటర్ జగడంపై పాక్ మాజీల స్పందన.. ఏమన్నారంటే..

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2022 (t20 world cup) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ (England Vs Pakistan) ఓటమిపాలైంది. ఫలితంగా రెండవసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడాలనుకున్న ఆ జట్టు కలలు కల్లలయ్యాయి. దీంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా తమ విచారం వ్యక్తం చేశారు. ఇలా స్పందించిన వారిలో పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ (shoaib akhtar ) కూడా ఉన్నాడు. ట్విటర్‌లో ‘ముక్కలైన హృదయం’ ఎమోజీని పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేశాడు. ఇక్కడివరకు అంతాబాగానే ఉన్నా.. ఈ ట్వీట్‌కు భారత పేసర్ మహ్మద్ షమీ (shami) స్పందించడంతో ట్విటర్ రగడ మొదలైంది. సెమీస్‌లో ఓడిన భారత్‌ను ఎగతాళి చేస్తూ వ్యాఖ్యానించిన అక్తర్‌కు కౌంటర్‌గా.. ‘సారీ సోదరా.. దీన్నే కర్మ అంటారు’ అంటూ షమీ స్పందించాడు. షమీ ఇలా స్పందించడంపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇటు షమీకి మద్దతుగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ కూడా కౌంటర్లు ఇస్తుండడంతో ట్విటర్‌లో రగడ కొనసాగుతోంది. ఈ ట్వీట్ వార్ అంతకంతకూ ముదురుతుండడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు స్పందించి కీలక సూచనలు చేశారు.

భారత్, పాకిస్తాన్‌కు చెందిన ప్రతిఒక్కరూ తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించాలని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Wasim Akram) సూచించాడు. ఈ విధంగా ట్విటర్‌లో మాటల యుద్ధం కొనసాగడం మంచిదికాదని హితబోధ చేశాడు. ‘‘ మాజీ క్రికెటర్‌ లేదా ప్రస్తుత క్రికెటర్‌గా చేయాల్సిందల్లా భారత్, పాకిస్తాన్ జట్లను ఒక తాటిపైకి తీసుకురావడమే. క్రికెటర్లుగా తటస్థంగా ఉండాలి. భారతీయులు వారి దేశం పట్ల దేశభక్తులైతే.. పాకిస్తానీయులు వారి దేశం విషయంలో భక్తులు. కానీ ఇలా ట్వీట్ల వార్‌కు దిగడం ఏమీ బాగాలేదు’’ అని స్పోర్ట్స్ షో ‘ ది పెవిలియన్’తో మాట్లాడుతూ అక్రమ్ అన్నాడు. మరోవైపు మిస్బా ఉల్ హక్ స్పందిస్తూ.. కొన్ని లైక్స్ కోసం ఇలా చేయడం తగదని షమీ ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

Updated Date - 2022-11-15T18:01:09+05:30 IST