వింబుల్డన్‌కు ప్రేక్షకులేరి?

ABN , First Publish Date - 2022-07-05T10:07:01+05:30 IST

ఆల్‌ఇంగ్లండ్‌ క్లబ్‌ టోర్నీకి ఈ ఏడాది టెన్నిస్‌ అభిమానుల సంఖ్య తగ్గింది! తొలి వారం మ్యాచ్‌లు చూసిన వారు 2,37,927 మంది మాత్రమే.

వింబుల్డన్‌కు ప్రేక్షకులేరి?

లండన్‌: ఆల్‌ఇంగ్లండ్‌ క్లబ్‌ టోర్నీకి ఈ ఏడాది టెన్నిస్‌ అభిమానుల సంఖ్య తగ్గింది! తొలి వారం మ్యాచ్‌లు చూసిన వారు 2,37,927 మంది మాత్రమే. 2019 టోర్నీ మొదటి వారంలో హాజరైన 2,56,808 మందితో పోలిస్తే ఈసారి 7 శాతం ప్రేక్షకులు తగ్గారు. అలాగే ఈసారి తొలిరోజు మ్యాచ్‌లకు 36,603 మంది  హాజరయ్యారు. 2007 తర్వాత మొదటిరోజు ఇంత తక్కువ హాజరవడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతుండడం,  ఫెడరర్‌, మెద్వెదెవ్‌ దూరం కావడంతోపాటు.. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో టిక్కెట్లపై ఖర్చు పెట్టడం ఎందుకని ఫ్యాన్స్‌ భావించడం.. దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. 

Read more