నీ మీద రూ.8 కోట్లు పెట్టారు.. నువ్వు ఆడాలయ్యా రాణా: ఆకాశ్ చోప్రా

ABN , First Publish Date - 2022-04-10T22:26:39+05:30 IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నితీశ్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు..

నీ మీద రూ.8 కోట్లు పెట్టారు.. నువ్వు ఆడాలయ్యా రాణా: ఆకాశ్ చోప్రా

ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నితీశ్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంత డబ్బు పెట్టి కొనుక్కున్నా అతడు ఆడుతున్నది పెద్దగా ఏమీ లేదు. 28 ఏళ్ల రాణా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 21, 10, 0, 8  పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా తలపడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.


తన యూట్యూబ్ చానల్‌లో చోప్రా మాట్లాడుతూ.. రాణాను రూ. 8 కోట్లు పెట్టి కొన్నారని, ఇప్పటి వరకు అతడు బ్యాట్ ఝళిపించలేదని అన్నాడు. కాబట్టి అతడు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుందని అన్నాడు. గొప్ప ఫామ్‌లో లేకున్నప్పటికీ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించాడని గుర్తు చేశాడు. మరోవైపు, కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించడం లేదని అన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ఇప్పటి వరకు 20 (నాటౌట్), 13, 26, 10 పరుగులు మాత్రమే చేశాడు. 

Read more