న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్

ABN , First Publish Date - 2022-04-05T09:40:05+05:30 IST

నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 115 పరుగులతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.

న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్

హామిల్టన్‌: నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 115 పరుగులతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తొలుత ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 333/8తో భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ గప్టిల్‌ (106), వన్‌డౌన్‌ విల్‌ యంగ్‌ (120) సెంచరీలతో దుమ్ము రేపారు. రెండో వికెట్‌కు వీరు 203 పరుగులు జోడించారు. అనంతరం నెదర్లాండ్స్‌ 42.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మైబర్గ్‌ (64) టాప్‌ స్కోరర్‌. 

Read more