పరారీలో క్రికెటర్‌ లామిచానె

ABN , First Publish Date - 2022-09-28T09:40:23+05:30 IST

పరారీలో ఉన్న నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానె ఆచూకీ కోసం ఆ దేశ పోలీసులు.. ఇంటర్‌పోల్‌ సహకారం కోరారు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న..

పరారీలో క్రికెటర్‌ లామిచానె

అత్యాచార ఆరోపణల్లో అరెస్టు వారెంట్‌

ఖట్మాండు: పరారీలో ఉన్న నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానె ఆచూకీ కోసం ఆ దేశ పోలీసులు.. ఇంటర్‌పోల్‌ సహకారం కోరారు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న 22 ఏళ్ల లామిచానెపై కోర్టు కొద్దిరోజుల క్రితం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. సందీప్‌ ప్రస్తుతం వెస్టిండీ్‌సలో ఉన్నట్టు సమాచారం. స్పిన్నర్‌ లామిచానె తనదైన ప్రతిభతో కొద్దికాలంలోనే నేపాల్‌ క్రికెట్‌ ముఖ చిత్రంగా ఎదిగాడు. 2018లో ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేయడంతో అతడి పేరు మార్మోగిపోయింది. కాగా.. అత్యాచార ఆరోపణల కారణంగా నేపాల్‌ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతోపాటు సస్పెండ్‌ చేశారు.

Read more