‘పాండ్యా..సహజసిద్ధ కెప్టెన్‌’

ABN , First Publish Date - 2022-11-25T03:23:37+05:30 IST

హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై సౌతాఫ్రికా హార్డ్‌హిట్టింగ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ ప్రశంసలు కురిపించాడు. అతడివి సహజసిద్ధ నాయకత్వ లక్షణాలని కొనియాడాడు.

‘పాండ్యా..సహజసిద్ధ కెప్టెన్‌’

న్యూఢిల్లీ: హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై సౌతాఫ్రికా హార్డ్‌హిట్టింగ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ ప్రశంసలు కురిపించాడు. అతడివి సహజసిద్ధ నాయకత్వ లక్షణాలని కొనియాడాడు. రోహిత్‌ శర్మ స్థానంలో..న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో టీమిండియాకు హార్దిక్‌ నాయకత్వం వహించిన విషయం విదితమే. ‘హార్దిక్‌లో సహజసిద్ధమైన సారథ్య లక్షణాలున్నాయి. ఆటగాడు ఎలా ఆడగలనని అనుకుంటాడో అతడిని ఆ విధంగా ప్రోత్సహిస్తాడు. అరంగేట్రంలోనే గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో కెప్టెన్‌ పాండ్యా కీలక భూమిక పోషించాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మిల్లర్‌ చెప్పాడు.

Updated Date - 2022-11-25T03:23:37+05:30 IST

Read more