భారత క్రికెట్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌

ABN , First Publish Date - 2022-06-11T09:30:41+05:30 IST

భారత క్రికెట్‌పై మ్యూజికల్‌ ఆల్బమ్‌ విడుదలైంది. ‘రోడ్‌ టు గ్లోరీ’ పేరిట తయారైన ఈ ఆల్బమ్‌లో భారత క్రికెట్‌ చరిత్రకు సంబంధించి ఆరు పాటలను..

భారత క్రికెట్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌

హైదరాబాద్‌: భారత క్రికెట్‌పై మ్యూజికల్‌ ఆల్బమ్‌ విడుదలైంది. ‘రోడ్‌ టు గ్లోరీ’ పేరిట తయారైన ఈ ఆల్బమ్‌లో భారత క్రికెట్‌ చరిత్రకు సంబంధించి ఆరు పాటలను రూపొందించారు. ఈ పాటలన్నింటినీ కాలికట్‌ యూనివర్సిటీలో చరిత్ర విభాగం ప్రొఫెసర్‌ వశిష్ట్‌ రచించారు. వశిష్ట్‌ విద్యార్థులైన సాయి గిరిధర్‌, జాక్సన్‌ వర్ఘీస్‌, సిలు ఫాతిమా ఆ గీతాలను పాడడంతో పాటు సంగీతాన్ని అందించడం విశేషం. వశిష్ట్‌ గతంలో టీ20 ప్రపంచకప్‌ (2007)లో టీమిండియా విజయంతో పాటు, 1983 వన్డే వరల్డ్‌క్‌పలో కపిల్‌ సేన అద్భుత విజయం.. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీకి సంబంధించిన అంశాలను పాటల రూపంలో పొందుపరిచారు. 

Read more