ముకేశ్‌ విజృంభణ సౌరాష్ట్ర 98 ఆలౌట్‌

ABN , First Publish Date - 2022-10-02T09:35:57+05:30 IST

పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4/23) నిప్పులు చెరగడంతో.. సౌరాష్ట్రతో ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌ తొలి రోజే రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగించింది.

ముకేశ్‌ విజృంభణ సౌరాష్ట్ర 98 ఆలౌట్‌

 సర్ఫ్‌రాజ్‌ అజేయ శతకం

రెస్టాఫ్‌ 205/3 

ఇరానీ ట్రోఫీ


రాజ్‌కోట్‌: పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4/23) నిప్పులు చెరగడంతో.. సౌరాష్ట్రతో ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌ తొలి రోజే రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగించింది. శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర.. ముకేశ్‌ బౌలింగ్‌ ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూలింది. ధర్మేంద్ర సింహ్‌ (28) టాప్‌ స్కోరర్‌. ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ సేన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన రెస్టాఫ్‌ మొదటి రోజు ఆటముగిసేసరికి 205/3 స్కోరు చేసింది. సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (125 బ్యాటింగ్‌), కెప్టెన్‌ విహారి (62 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. మొత్తంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు రెస్టాఫ్‌ 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Read more