Dhoni and Sachin: ప్రకటన కోసం చేతులు కలిపిన ధోనీ, సచిన్

ABN , First Publish Date - 2022-10-07T00:27:14+05:30 IST

ఇండియన్ క్రికెట్‌కు చెందిన రెండు దిగ్గజాలు ఓ ప్రకటన కోసం చేతులు కలిపాయి. వారిద్దరూ ఎవరో కాదు.. సచిన్

Dhoni and Sachin: ప్రకటన కోసం చేతులు కలిపిన ధోనీ, సచిన్

న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్‌కు చెందిన రెండు దిగ్గజాలు ఓ ప్రకటన కోసం చేతులు కలిపాయి. వారిద్దరూ ఎవరో కాదు.. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), ఎంఎస్ ధోనీ (MS Dhoni). క్యాజువల్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్లు ధరించిన ఈ ఇద్దరూ టెన్నిస్ కోర్టులో కనిపించారు. ఓ అడ్వర్టైజ్‌మెంట్ కోసం వీరు టెన్నిస్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెన్నిస్ నెట్ వద్ద అడ్వర్టైజ్‌మెంట్ సిబ్బంది ఇస్తున్న సూచనలను వీరిద్దరూ జాగ్రత్తగా  వింటున్న ఫొటోలు కూడా నెట్‌లో దర్శనమిచ్చాయి.


ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది అభిమానించే క్రికెటర్లలో ధోనీ (Dhoni), సచిన్ (Sachin) పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇండియన్ క్రికెట్‌‌కు వీరిద్దరూ ఎనలేని సేవలు అందించారు. వీరిద్దరికీ టెన్నిస్ అంటే కూడా ఇష్టమే. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో మరో లెజండరీ క్రికెటర్ కపిల్‌దేవ్‌ (Kapil Dev)తో ధోనీ కనిపించాడు. టెన్నిస్ టోర్నీలకు హాజరు కావడం సచిన్‌కు మమూలే అయినా, ధోనీకి మాత్రం చాలా అరుదు. తన స్నేహితుడైన రోజర్ ఫెదరర్‌ను కలిసేందుకు సచిన్(Sachin) తరచూ ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు వెళ్తుండేవాడు. 


అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన తర్వాత ధోనీ (MS Dhoni) ఇతర ఆటలపై దృష్టి సారించాడు. ధోనీ ఇటీవల గురుగ్రామ్‌లో జరిగిన ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నీలో గోల్ఫ్ ఆడాడు. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు అయిన కేదార్ జాదవ్‌తో కలిసి 2019 నుంచి ధోనీ గోల్ఫ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో ధోనీ చెన్నైకి సారథ్యం వహిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఈ టోర్నీలో ధోనీ 14 మ్యాచుల్లో 232 పరుగులు చేశాడు. మరోవైపు, ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియన్ లెజెండ్స్ జట్టు వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

Updated Date - 2022-10-07T00:27:14+05:30 IST