భారత్‌లో వచ్చే ఏడాది మోటో గ్రాండ్‌ ప్రీ

ABN , First Publish Date - 2022-10-01T09:56:16+05:30 IST

భారత్‌ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది.

భారత్‌లో వచ్చే ఏడాది మోటో గ్రాండ్‌ ప్రీ

న్యూఢిల్లీ: భారత్‌ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు 22-24 తేదీల్లో మోటార్‌ సైకిల్‌ గ్రాండ్‌ప్రీ రేస్‌ ఇక్కడి బుద్ధా ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరగనుంది. ఈమేరకు అంతర్జాతీయ మోటార్‌ సైకిల్‌ స్పోర్ట్స్‌ సంస్థ...మోటోజీపీ శుక్రవారం ప్రకటించింది. తొమ్మిదేళ్ల కిందట ప్రఖ్యాత ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌ తర్వాత భారత్‌లో తిరిగి ఓ గ్రాండ్‌ ప్రీ జరగనుండడం విశేషం. 2011 నుంచి 2013 వరకు ఎఫ్‌-1 కార్‌ రేసింగ్‌ బుద్ధా సర్క్యూట్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more