బస్సు నెం.315

ABN , First Publish Date - 2022-04-10T09:09:17+05:30 IST

బస్సు నెంబర్‌ 315. ముంబైలో తిరిగే ఈ సిటీ సర్వీ్‌సకు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు విడదీయలేని బంధం ఉంది.

బస్సు నెం.315

సచిన్‌ జ్ఞాపకాలు


ముంబై: బస్సు నెంబర్‌ 315. ముంబైలో తిరిగే ఈ సిటీ సర్వీ్‌సకు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు విడదీయలేని బంధం ఉంది. టెండూల్కర్‌ క్రికెట్‌లో ప్రవేశించిన తొలినాళ్ల లో బాంద్రా నుంచి వెళ్లే ఈ బస్సు ఎక్కి శివాజీపార్క్‌కు చేరి అక్కడ రమాకాంత్‌ అచ్రేకర్‌ వద్ద ట్రెయినింగ్‌ తీసుకునేవాడు. కాగా శుక్రవారం ఆ బస్సు వద్దకు వెళ్లిన సచిన్‌..అందులోకి ఎక్కి ఏళ్లనాటి అనుభవాలను నెమరువేసుకొని ఉద్విఘ్నభరితుడయ్యాడు. ‘చాలా ఏళ్ల తర్వాత...ఈ 315 నెంబరు బస్సును చూస్తున్నా. ప్రాక్టీస్‌ చేసి వచ్చేటప్పుడు ఆ బస్సులోని చివరి విండో సీటులో కూర్చునే వాణ్ణి. రోజంతా కఠోరంగా ప్రాక్టీస్‌ చేయడంవల్ల ఆ చల్లటిగాలికి హాయిగా నిద్రపోయేవాడిని. ఒక్కోసారి బస్సు నేను దిగాల్సిన స్టాప్‌దాటి వెళ్లిపోయేద’న్నాడు. ఈ మేరకు బస్సుతో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాలో సచిన్‌ పోస్ట్‌ చేశాడు. 

Read more