రాజస్థాన్‌పై టాస్ గెలిచిన లక్నో

ABN , First Publish Date - 2022-04-11T00:38:14+05:30 IST

ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్

రాజస్థాన్‌పై టాస్ గెలిచిన లక్నో

ముంబై: ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్  మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రెండు జట్లు రాణిస్తుండడంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.


లక్నో జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. లూయిస్, టై స్థానంలో స్టోయినిస్, చమీర జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులోనూ రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. నవదీప్ సైనీ స్థానంలో కుల్దీప్ సేన్, యశస్వి జైస్వాల్ స్థానంలో డుసెన్ తుది జట్టులోకి వచ్చారు.

Read more