మరో టైటిల్‌పై సింధు గురి

ABN , First Publish Date - 2022-04-05T09:38:24+05:30 IST

స్విస్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. మరో టైటిల్‌పై గురిపెట్టింది.

మరో టైటిల్‌పై సింధు గురి

కొరియా ఓపెన్‌ నేటి నుంచి

సన్‌చియాన్‌ (కొరియా): స్విస్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. మరో టైటిల్‌పై గురిపెట్టింది. మంగళవారం నుంచి  జరిగే కొరియా ఓపెన్‌లో సింధు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జర్మన్‌ ఓపెన్‌, ఆల్‌ ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించిన లక్ష్యసేన్‌ ఈసారి పురుషుల్లో  విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి రౌండ్‌లో కొరియా క్వాలిఫయర్‌ చోల్‌ జి హున్‌తో ఆరో సీడ్‌ లక్ష్య తలపడనున్నాడు. 5వ సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి రౌండ్‌లో లారెన్‌ లామ్‌ (అమెరికా)ను మూడో సీడ్‌ సింధు ఢీకొననుంది. మాళవిక బన్సోడ్‌, శ్రీకృష్ణ ప్రియ కూడా బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌, అర్జున్‌-ధ్రువ్‌, నవనీత్‌-సుమీత్‌, అశ్విని-సిక్కిరెడ్డి జంటలు ఆడనున్నాయి.

Read more