మొహాలీలో కోహ్లీ వందో టెస్ట్‌!

ABN , First Publish Date - 2022-02-16T08:52:40+05:30 IST

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది.

మొహాలీలో కోహ్లీ వందో టెస్ట్‌!

లంకతో ముందుగా టీ20లు

న్యూఢిల్లీ: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఈనెల 24 నుంచి జరిగే పర్యటనలో లంకతో భారత్‌ తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత రెండు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. వాస్తవంగా ముందు టెస్ట్‌లు, ఆ తర్వాత టీ-20లు ఆడే విధంగా షెడ్యూల్‌ చేశారు. కానీ, ముందు పరిమిత ఓవర్ల సిరీస్‌లు నిర్వహించాలన్న లంక విజ్ఞప్తి మేరకు భారత బోర్డు ఈ మార్పులు చేసింది. కాగా, వచ్చే నెల 4 నుంచి మొహాలీలో జరిగే తొలి టెస్ట్‌తో కోహ్లీ కెరీర్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకొనే అవకాశం ఉంది. మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్ట్‌ను డే/నైట్‌గా నిర్వహించనున్నారు. చివరిసారిగా స్వదేశంలో అహ్మదా బాద్‌లో నిర్వహించిన పింక్‌బాల్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. లఖ్‌నవూలో ఈ నెల 24న తొలి టీ20 జరగనుండగా.. 26, 27న ధర్మశాలలో రెండు, మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 


టీ20 సిరీస్‌

తొలి టీ20 ఫిబ్రవరి 24 లఖ్‌నవూ

రెండో టీ20 ఫిబ్రవరి 26 ధర్మశాల

మూడో టీ20 ఫిబ్రవరి 27 ధర్మశాల


టెస్ట్‌ సిరీస్‌

తొలి టెస్ట్‌ మార్చి 4-8 మొహాలీ

రెండో టెస్ట్‌(డే/నైట్‌) మార్చి 12-16 బెంగళూరు

Read more