నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ బౌలర్లు.. క్యూకడుతున్న కేకేఆర్ బ్యాటర్లు

ABN , First Publish Date - 2022-04-29T01:56:12+05:30 IST

ఢిల్లీ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు

నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ బౌలర్లు.. క్యూకడుతున్న కేకేఆర్ బ్యాటర్లు

ముంబై: ఢిల్లీ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆరంభం ఏమంత కలిసి రాలేదు. 4 పరుగుల వద్ద ఓపెనర్ అరోన్ ఫించ్ (3) అవుటయ్యాడు. అది మొదలు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.


22 పరుగుల వద్ద వెంకటేష్ అయ్యర్ (6) వికెట్‌ను కోల్పోయిన కేకేఆర్ 35 పరుగుల వద్ద బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పది ఓవర్లు ముగిశాయి. కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (27), నితీశ్ రాణా (10)  క్రీజులో ఉన్నారు. కుల్దీప్ యాదవ్‌ రెండు, చేతన్, అక్షర్ పటేలో చెరో వికెట్ తీసుకున్నారు.

Read more